బెంగళూరులో ఇద్దరు టెకీల ఆత్మహత్య
- తోటి ఉద్యోగినితో సిద్దిపేట యువకుడి సహజీవనం
ఉరేసుకుని యువకుడి బలవన్మరణం
భవనం పైనుంచి దూకి యువతి సూసైడ్
సిద్దిపేట, మార్చి 31 (విజయక్రాంతి): బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ, సహజీవనంలో ఉన్న ఇద్దరు మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని అన్నాసాగర్ గ్రామానికి చెందిన కుంట విజయలక్ష్మి, రఘుపతిరెడ్డిలకు ఇద్దరు కుమారులు, కు మార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు భానుచందర్‌రెడ్డి (32) 12 సంవత్సరాల క్రితం కెనడాలో ఉద్యోగం కోసం వెళ్లాడు. భానుచందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు తెలియకుం డా రెండు సంవత్సరాల క్రితమే బెంగళూరులో బీబీ షాజియా సిరాజ్‌తో సహజీవనం చేస్తూ, ఉద్యోగం చేస్తున్నాడు.
ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ యువతి ఇంటి సామ గ్రి తేవడానికి బయటకు వెళ్లిన సమయంలో వారు ఉంటున్న అపార్ట్మెంట్‌లో ఉరేసుకొని భానుచందర్‌రెడ్డి ఆత్మహ త్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన షాజియా అది చూసి షాక్‌కి గురయ్యింది.. దీంతో 7వ అంతస్తుల భవనం పైనుంచి దూకి తానూ ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు భానుచందర్‌రెడ్డి వద్ద సూసైడ్ నోట్ లభించింది.
మాన సిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్టు లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. అతని వద్ద ఉన్న ధ్రువీకరణ పత్రాలు ఆధారంగాకు టుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. భానుచందర్‌రెడ్డి మృతదే హాన్ని బుధవారం స్వగ్రా మానికి తీసుకురానున్నట్లు తెలిపారు.




