ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికుల దీక్షకు టీఆర్పీ మద్దతు
- సమస్యలను తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్తాం
టీఆర్పీ నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 31(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికులు తమ వేతన సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే నిరా హార దీక్షలకు మంగళవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) సంపూర్ణ మద్ద తు ప్రకటించింది. 13వ వేతన ఒప్పందంలో మిగిలిన సమస్యలను 14వ వేతనంలో పరిష్కరించాలనే డిమాండ్‌తో కార్మికులు ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లా, మండల కమిటీల నాయకులు దీక్షా స్థలానికి చేరుకుని కార్మికులకు సంఘీభావం తెలిపారు.
వారి సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని, తక్షణమే పరిష్కారం దిశగా చర్య లు తీసుకునేలా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి తెలియజేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల హక్కుల సాధనలో పార్టీ ఎప్పటికీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు వేపూరి స్రవం తి, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు వడ్లానపు తిరుపతమ్మ, జిల్లా ఉపాధ్యక్షుడు కోడిపోయిన రవి పటేల్, జిల్లా మహిళా సెక్రటరీ ధరావత్ లక్ష్మి, బూర్గంపాడు మండల అధ్యక్షులు వట్టికోట రామకృష్ణ, అశ్వాపురం మం డల అధ్యక్షులు ఇలాసాగారం కోటేశ్వరరావు, మణుగూరు మండల మహిళా అధ్యక్షురాలు మేకపోతుల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల న్యాయమైన డిమాం డ్ల సాధన వరకు తమ పోరాటం కొనసాగుతుందని, వారికి పార్టీ అన్ని విధాలుగా అండ గా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు.




