19 May, 2026 | 4:58 AM

గంజాయి కేసులో ఇద్దరికి 10 ఏళ్ల జైలు

19-05-2026 12:00 AM

రూ.లక్ష చొప్పున జరిమానా 

ములుగు (మహబూబాబాద్), మే 18 (విజయక్రాంతి): ములుగు జిల్లా కోర్టు గంజాయి కేసులో కీలక తీర్పు ఇచ్చిందని ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ తెలిపారు. జిల్లాలోని తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసును న్యాయమూర్తి ఎస్‌విపి. సూర్య చంద్రకళ సోమవారం విచారించారు.

మహబూబాబాద్ జిల్లా గూ డూరు మండలం రంగంపేట గ్రామం పల్తి యా తండాకు చెందిన పల్తియా శంకర్, వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్‌కు చెందిన బూడిద శ్రీకాంత్ గంజాయి రవాణ, వినియోగంపై కేసు నమోదైంది. అభియోగాలు రుజువుకావడంతో ఇద్దరికీ 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పా టు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున కోర్టు జరిమానా విధించింది.