18 May, 2026 | 6:46 PM

నరకయాతన

18-05-2026 06:03 PM

ఉప్పల్ రింగ్ రోడ్డు మూసివేయడంతో గందరగోళంగా మారి ట్రాఫిక్ వ్యవస్థ 

ఉప్పల్ మే 18 విజయక్రాంతి : ఉప్పల్ రింగ్ రోడ్ వరంగల్ హైవే మార్గం పూర్తిగా మూసివేయడంతో ఉప్పల్ మార్గం నరకయాతనగా మారింది   ఉప్పల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వెళ్లే దారి మెట్రో స్టేషన్ దారి ఉప్పల్ గణపతి ఫ్యాక్టరీ దారి నిత్యం వాహనాలు భారీ సంఖ్యలో రాకపోకలు సాగించడంతో గల్లీలు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో గంటల తరబడి వాహనాలు కదలని పరిస్థితి ఏర్పడడంతో ట్రాఫిక్ పోలీసులు గల్లిలో శ్రమిస్తున్నారు. ఉప్పల్లోని రాజిరెడ్డి ఎలివేటెడ్ కార్డెన్ నిర్మాణ పనుల కోసం వరంగల్ జాతీయ రహదారి గుండా ఉప్పల్ రింగ్ రోడ్డుకు వాహనాలు రాకుండా రోడ్డును మూసివేశారు  ఉప్పల్ రింగ్ రోడ్ లోని స్మశానాల వద్ద కార్డియార్ సంబంధించిన పిల్లర్ నిర్మాణాలు పనుల  చేపట్టడంతో దీంతో ఉప్పల్ రింగ్ రోడ్డు కు వెళ్లే వారదారులకు ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. కార్యాలయాలకు వెళ్లే వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్కనే ఉన్న చిన్న గల్లీలో నుండి వాహనదారులు వెళ్లడంతో  ఉప్పల్ పరిసర ప్రాంతంలో ఉన్న గల్లీలు వాహనదారులతో కిక్కిరిసిపోతున్నాయి 

 డైవర్షన్ బోర్డు లేక ఇబ్బందులు 

 వరంగల్ జాతీయ రహదారి గుండా నగరానికి వచ్చే వాహనదారులకు నల్లచెరువు దాటాక బగాయిత్ లోనికి హెచ్ఎండిఏ లేఔట్ మీదుగా వెళ్లాలి సరియైన డైవర్షన్ బోర్డు లేకపోవడంతో వాహనదారులు ఎటు పోవాలా తెలియక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొన్నది. రింగ్ రోడ్డు వరకు వచ్చి  రహదారి బంధువులను తో ఎటు వెళ్ళాలో అర్థం కాక రహదారి మధ్యలోనే ఆగిపోవడం వల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించి  వాహనదారులు గంటలు తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అత్యవసర పరిస్థితిలో వెళ్లే వాహనదారులు  ట్రాఫిక్ ఇబ్బందులు పెడుతున్నారు మరో మూడు నెలలు పాటు కార్డియార్ పనులు   జరగ నుండడంతో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. రానున్న వర్షాకాలం రింగ్ రోడ్డు మూసేయడం ట్రాఫిక్ మళ్లింపు తో వాహనదారులు మరో మూడు నెలలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది.  అత్యవసరంగా వెళ్లాలనుకునే వాహనదారులు  గమనించి మరొక దారిని  చూసుకోవడం మంచిది.