13 July, 2026 | 5:26 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

ట్యాంకులో ఊపిరాడక ఇద్దరు మృతి

24-12-2025 12:07 AM

అపార్టుమెంట్ ఎస్టీపీ ట్యాంకు శుభ్రం చేస్తుండగా ప్రమాదం

రామచంద్రాపురం(పటాన్‌చెరు), డిసెంబర్ 23: అపార్టుమెంట్‌లోని ఎస్టీపీ ట్యాంకులను శుభ్రం చేస్తూ, ఊపిరాడక ఇద్దరు ఆపరేటర్లు మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో జరిగింది. సోమిత్ రుయిడాస్(22)    కొల్లూరులోని బ్లాసమ్ హైట్స్ అపార్టుమెంట్‌లో ఎస్టీపీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనితో పాటు హరీష్‌సింగ్  కూడా పనిచేస్తున్నాడు. 22న రాత్రి వరకు ఎస్టీపీ ట్యాంకులోని నీటిని తొలగించిన అనంతరం ఇద్దరు ఆపరేటర్లు ట్యాంక్ శుభ్రపరిచేందుకు లోపలికి వెళ్లారు. వారికి ఆక్సిజన్ అందక ఉక్కిరిబిక్కిరై, అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.