బీసీలకు 2లక్షల కోట్లు కేటాయించాలి
ముషీరాబాద్, మే 27 (విజయక్రాంతి) : జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అర్.కృష్ణయ్య నేతృత్వంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు ఢిల్లీలో జాతీయ బీసీ కమిషన్ చైర్‌పర్సన్ సాధ్వి నిరంజన్ జ్యోతిని బుధవారం కలిసి బీసీ ల సంక్షేమం, విద్య, ఉపాధి అంశాలపై చ ర్చించారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మం త్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీల అభివృద్ధికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిం చాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న హాస్టళ్లు, గు రుకుల పాఠశాలలు, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాలను దేశవ్యాప్తం గా అమలు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు పెరికే సురేష్, ఆశిష్ గౌడ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అధిక ఫీజుల కారణంగా చదువులు మానుకుంటున్నారన్నారు.






