1 June, 2026 | 5:05 AM

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సభ్యత్వ నమోదు

01-06-2026 01:52 AM

గాంధారి, మే 31 (విజయ క్రాంతి) :  కామారెడ్డి జిల్లా *టి.యు.డెబ్లు.జె (ఐ.జె. యు) సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం గాంధారి మండల  కేంద్రంలో చేప ట్టారు. ఈ సందర్బంగా మండలానికి చెం దిన పత్రికా విలేకరులకు జిల్లా సభ్యత్వాన్ని జిల్లా నాయకులు అందజేశారు.. ఈ సందర్భంగా జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా మహాసభను జిల్లా కేంద్రం లో జూన్ 12 వ తేదీన నిర్వహిస్తున్నట్లు  తెలిపారు. మండలానికి చెందిన పాత్రికేయులు అందరూ ఈ సభకు హాజరు అయ్యి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ  కార్యక్రమంలో జిల్లా టి.యు.డెబ్లు.జె నాయకులు  శ్రీనివాస్, అభిద్, చక్రధర్ మండల జర్నలిస్ట్ ప్రతినిధులు నారాయణ, శ్రీధర్, సంతోష్, శివకుమార్, అభిలాష్ , సందీప్, సంజీవ్, గౌస్ పాల్గొన్నారు.