calender_icon.png 12 February, 2026 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

73% పోలింగ్

12-02-2026 02:30:50 AM

  1. పట్టణాల్లో పోటెత్తిన ఓటర్లు l 91.91 శాతంతో చౌటుప్పల్ మొదటి స్థానం 
  2.   59.68 శాతంతో చివరి స్థానంలో నందికొండ
  3.   77.36 శాతంతో నల్లగొండ కార్పొరేషన్ మొదటి స్థానం 
  4. నిజామాబాద్‌లో 59.12 శాతమే నమోదు 
  5. చెదురుమదురు ఘటనలు మినహా అంతటా పోలింగ్ ప్రశాంతం 
  6. బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం l
  7. రేపు ఓట్ల లెక్కింపు.. 136 కేంద్రాలు ఏర్పాటు 
  8. 16న చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి) : తెలంగాణలో మున్సిపల్ , కార్పొ రేషన్ ఎన్నికల పోలింగ్  ముగిసింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి బుధవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అప్పటిలోగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు అధికారు లు ఓటు వేసే అవకాశం కల్పించారు.  మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 73.01  శాతం ఓటింగ్ నమో దైంది. మున్సిపాలిటీల విషయానికి వస్తే 75.88 శాతం, ఏడు కార్పొరేషన్లకు సంబంధించి 66.05 శాతం ఓటింగ్ నమోదైంది.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ 91.91 శాతం ఓటింగ్‌తో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రెండో స్థానంలో నల్లగొండ జిల్లా చండూరులో 91.52 శాతం,  మూడో స్థానంలో సంగారెడ్డి జిల్లా జిన్నారం 90.98 శాతం, యాదాద్రి జిల్లాలోని పోచంపల్లి 90.95 శాతంతో నాలుగో స్థానం, యాదగిరిగుట్ట 89.86 శాతంతో  ఐదో స్థానంలో నిలిచింది. నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ 59.68 శాతం ఓటింగ్‌తో చివరి స్థానంలో నిలిచింది. ఇక కార్పొరేషన్లలో  నల్లగొండ కార్పొరేషన్‌లో 77.36 శాతం ఓటింగ్ నమోదుతో మొదటి స్థానంలో నిలిచింది. 

 నిజాబామాబాద్ కార్పొరేషన్‌లో 59.12 శాతం ఓటింగ్ నమోదైంది. 

ప్రశాంతంగా ప్రారంభమై..

 పోలింగ్ సరళి  తొలుత ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ పోలింగ్ ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉద్రిక్తతలు నమోదయ్యాయి. ప్రధాన పార్టీల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల రాజకీయ పార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా అదుపుతప్పే పరిస్థితులు ఉంటే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకురావడంతో పోలింగ్ ప్రక్రియ అంతా సజావుగా జరిగిపోయింది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్లు ఈ నెల 13న  ఉదయం 8 గంటల నుంచి 136 కేంద్రాల్లో లెక్కింపు చేపట్టనున్నారు. 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నారు. 

నువ్వా.. నేనా అన్నట్లుగా ప్రచారం..

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో తమ జెండా ఎగరేసేందుకు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ప్రచార పర్వాన్ని సాగించాయి. ప్రత్యర్థులపై మాటల తూటాలు వదులుతు రాజకీయాన్ని రక్తికట్టించాయి. వాదనలు, సవాళ్లతో మొదలైన ప్రచార విలువలకు తిలోదకాలు ఇస్తూ తిట్లపురాణాల వరకు చేరుకుంది. పార్టీల వ్యూహాలు, హామీలు, ప్రచార సరళిని అంతా గమనించిన ఓటర్లు పార్టీల భవిష్యత్ ను, అభ్యర్థుల అదృష్టాన్ని ఓటు రూపంలో బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో శుక్రవారం తేలనుంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డులకు గాను 12 వార్డులు ఏకగ్రీవం కాగా ఒక చోట వాయిదా పడింది. దీంతో ఇవాళ 2,569 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన 414 వార్డుల్లో 2 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 412 వార్డులకు పోలింగ్ నిర్వహించారు.

రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లో 

పోలైన ఓట్ల శాతం వివరాలు 

చౌటుప్పల్ 91.77

చండూరు 91.14

జిన్నారం 92 .06

పోచంపల్లి 91.01

యాదగిరిగుట్ట 89.70

మూడుచింతలపల్లి 88.29

తిర్మలగిరి 88.50

చిట్యాల 87.50

కల్లూరు 86.40

మోత్కూరు 87.07

వర్దన్నపేట 85.79

కేసముద్రం 85.70

గడ్డపోతారం 84.84

ఆలేరు 86.51

హాలియా 85.43

దేవరకద్ర 86.64

ఏదులాపురం 84.38

మరిపెడ 85.14

నర్సంపేట 84.71

దుబ్బాక 85.45

రామాయంపేట 84.99

ఇంద్రేశం 84.75

ఆమనగల్ 84.81

ఐజ 85.52

బూత్పూర్ 83.97

స్టేషన్‌ఘన్‌పూర్ 85.49

వడ్డేపల్లి 85.62

హుస్నాబాద్ 84.68

వైరా 83.72

అమరచింత 84.44

చేర్యాల 84.50

ఎల్లంపేట 82.24

పెబ్బేరు 83.34

భువనగిరి 83.54

హుజూర్‌నగర్ 82.29

డోర్నకల్ 81.94

గుమ్మడిదల 80.01

సుల్తానాబాద్ 81.30

హుజురాబాద్ 81.13

చేవెళ్ల 80.58

తూప్రాన్ 80.94

అలంపూర్ 81.54

కల్వకుర్తి 80.49

మెదక్ 81.75

ఇస్నాపూర్ 78.98

ములుగు 80.30

దేవరకొండ 80.00

మొయినాబాద్ 79.75

పరకాల 79.93

కొల్లాపూర్ 80.23

జమ్మికుంట 79.82

ఎల్లారెడ్డి 80.84

అలియాబాద్ 78.13

అందోల్(జోగిపేట) 80.84

సూర్యాపేట 78.97

గజ్వేల్ 79.61

నేరెడుచర్ల 77.57

జనగామ 79.19

మద్దూర్ 79.99

సదాశివపేట 79.63

చొప్పదండి 77.55

కొత్తకోట 79.59

నర్సాపూర్ 78.63

బిచ్‌కుంద 79.63

ఇబ్రాహీంపట్నం 77.56

మధిర 77.99

వేములవాడ 75.59

తొర్రూరు 77.46

సత్తుపల్లి 77.50

ఆసిఫాబాద్ 78.17

సిరిసిల్ల 76.28

మిర్యాలగూడ 77.35

ఆత్మకూర్ 78.94

పరిగి 76.98

శంకర్‌పల్లి 77.59

కోదాడ 77.02

లక్షెట్టిపేట 76.75

మంథని 77.61

అశ్వరావుపేట 76.40

షాద్‌నగర్ 75.86

చెన్నూర్ 76.33

కొడంగల్ 77.99

మహబూబాబాద్ 75.39

కోహీర్ 75.77

ధర్మపురి 71.97

రాయికల్ 69.03

బెల్లంపల్లి 75.81

కోస్గి 74.76

ఖానాపూర్ 70.53

గద్వాల 75.27

వికారాబాద్ 74.71

నారాయణపేట 75.09

నాగర్‌కర్నూల్ 73.92

బాన్స్‌వాడ 73.76

పెద్దపల్లి 73.31

నారాయణఖేడ్ 73.43

జహీరాబాద్ 73.92

క్యాతన్‌పల్లి 71.66

వనపర్తి 71.76

మక్తల్ 71.29

సంగారెడ్డి 70.57

బీమ్‌గల్ 62.70

కోరుట్ల 64.45

జగిత్యాల 67.08

మెట్‌పల్లి 64.89

ఆదిలాబాద్ 70.55

బోధన్ 67.76

ఇల్లెందు 68.75

ఆర్మూర్ 64.58

తాండూర్ 67.97

కామారెడ్డి 63.74

నిర్మల్ 64.24

భూపాలపల్లి 64.40

కాగజ్‌నగర్ 64.39

బైంసా 63.69

నందికొండ 59.84 

ఏడు కార్పొరేషన్లలో 

నమోదైన ఓటింగ్ శాతం

నల్లగొండ 76.93

కొత్తగూడెం 74.62

రామగుండం 68.69

మహబూబ్‌నగర్ 67.78

మంచిర్యాల 64.79

కరీంనగర్ 62.22

నిజామాబాద్ 58.80