13 April, 2026 | 12:54 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

పేదింటి ఆడబిడ్డలకు అండగా ప్రజా ప్రభుత్వం

12-02-2026 02:29 AM
  1. రూ. 1.59 కోట్ల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

హనుమకొండ, కాజీపేట మండలాల లబ్ధిదారులకు చేయూత వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 11 (విజయశాంతి): పేద కుటుంబాల్లో పుట్టిన ఆడబిడ్డల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా కొండంత అండగా నిలుస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ గోకుల్ నగర్ లోని అంబేద్కర్ భవన్లో బుధవారం హనుమకొండ, కాజీపేట మండలాలకు సంబంధించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మొత్తం 159 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 1,59,18,444 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డల వివాహాల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదన్నదే ప్రజా ప్రభుత్వ ప్రధాన ఆశయమని అన్నారు. గతంలో పెళ్లి చేయాలంటే పేదలు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈ పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా ఆర్థిక సాయం అందేలా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

నియోజకవర్గంలోని ప్రతి అర్హుడికి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారులతో ముచ్చటించిన ఎమ్మెల్యే, ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ, కాజీపేట తహసిల్దార్లు గుజ్జుల రవీందర్ రెడ్డి, రాజు, కార్పొరేటర్లు మామిండ్ల రాజు, పోతుల శ్రీమాన్, జక్కుల రవీందర్ యాదవ్,

విజయ శ్రీ రజాలి, ఏనుగుల మానస రాంప్రసాద్, వేముల శ్రీనివాస్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, బంక సంపత్ యాదవ్, అంబేద్కర్ రాజు, మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, పలు డివిజన్ అధ్యక్షులు ఏనుకొంటి పున్నం చందర్, తాళ్లపల్లి సుధాకర్, బంక సతీష్, తడుక సుమన్ గౌడ్, కాంగ్రెస్ శ్రేణులు తాళ్లపల్లి రవీందర్ (జె.కె) అనిల్ కుమార్, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.