12-02-2026 02:31:11 AM
కేసముద్రం, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో నూత నంగా ఏర్పాటు చేసిన కేసముద్రం మున్సిపాలిటీలో తొలిసారి నెగ్గేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల కు చెందిన పలువురు అభ్యర్థులు ఓట్లకు నో ట్లు వెదజల్లారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. కేసముద్రం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవి ఎస్టీ మహిళకు కేటాయించారు.
చైర్ ప ర్సన్ పదవి ఆశలు పెట్టుకున్న పలువురు అభ్యర్థులు వారు పోటీకి దిగిన ఆయా వా ర్డుల్లో తక్కువలో తక్కువ ఓటర్లకు 5000 నుండి 7000 వరకు పంపిణీ చేసినట్లు వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు కొందరు వైస్ చైర్ పర్సన్ పదవి కాంక్షిస్తూ , కౌన్సిలర్ గా గెలుపొందడానికి ఇబ్బడి ము బ్బడిగా ఖర్చుపెట్టినట్లు ప్రచారం సాగుతోం ది.
మహిళా ఓటర్లకు చీరలతో పాటు పురుషులకు సుక్క, ముక్క పంపిణీ చేస్తూ గత కొ ద్దిరోజులుగా తమకే ఓటు వేయాలని వేడుకున్నారు. పోలింగ్ కు ఒక రోజు ముందుగా ఓటుకు నోటు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు విమర్శలు వస్తున్నాయి. పోటీ తగ్గా ఫర్ ఉన్నచోట ఎదుటి అభ్యర్థి ఇంతిచ్చాడు అనేది తెలుసుకొని అందుకు కొంత పెంచి పంచినట్లు ప్రచారం సాగుతోంది.
కేసముద్రం మున్సిపాలిటీలో ఒక వార్డులో మంగళవారం రాత్రి ఓ పార్టీ అభ్యర్థి ఓటుకు 2500 చొప్పున పంపిణీ చేయగా, ఇంకో పార్టీ అభ్యర్థి 3000 చొప్పున పంపిణీ చేసి, బుధవారం ఉదయం మళ్లీ అదనంగా 10 00 నుండి 1200 రూపాయలు పంపిణీ చేశారని ప్రచారం జరిగింది. కొత్తగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీలో తొలిసారి విజ యం సాధించేందుకు అభ్యర్థులు ఓట్లకు నోట్లు విచ్చలవిడిగా వెదజల్లినట్లు ప్రచారం సాగుతోంది.
గతంలో కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, అమీనాపురం, ధనసరి, సబ్ స్టేషన్ తండా గ్రామాలు ఉండగా వీటిని విలీనం చేసి కేసముద్రం మునిసిపాలిటీగా ఏర్పాటు చేశారు. గ్రామాలుగా ఉన్న సమయంలో పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నిక సమయంలో 500 కు మిం చి డబ్బులు ఇవ్వకపోగా ఇప్పుడు ఏకంగా 2000 నుంచి 7000 వరకు ఇవ్వడంతో పాటు వారం రోజులపాటు సుక్క, ముక్క, చీరెలు, నజరాణాలు ఇవ్వడంతో ఓటర్లు తెగ సంబర పడుతున్నారు.