అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తుమ్మల
08-07-2026 02:05 AM
ఖమ్మం, జూలై 7(విజయ క్రాంతి): నగరంలో 58వ డివిజన్ బిసి కాలనీలో ఒక కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిసి డ్రెయిన్ల పనులకు మంగళవారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ, నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నగరంలో ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువాళ్ళా దుర్గాప్రసాద్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






