సింగరేణి అధికారుల నిరసన దీక్షలకు షెడ్యూల్ కులాల జేఏసీ సంఘీభావం
చుంచుపల్లి, జూలై 7,(విజయక్రాంతి ): సింగరేణి మైనింగ్ అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మంగళవారం షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలియజేశారు. రుద్రంపూర్ సింగరేణి జిఎం కార్యాలయం ముందు వర్క్ షాప్ ఏజీఎం కలవల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగింది.
ఈ దీక్షా శిబిరాన్ని షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు. సింగరేణి మైనింగ్ అధికారుల న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలన్నారు.
కార్మికులు,యాజమాన్యం, ప్రభుత్వం సమన్వయం తో సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఎనగంటి కృపాకర్,బొమ్మెర పవన్ కళ్యాణ్,ఎనగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






