8 July, 2026 | 3:05 AM

శ్లోక రెడ్డికి మెరిట్ స్కాలర్‌షిప్

08-07-2026 02:06 AM

ఇల్లెందు, జులై 7,(విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాకు చెందిన జేకే-5 ఓసీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వై. లక్ష్మీనర్సయ్య కుమార్తె వై. శ్లోక రెడ్డి ఎన్సీడబ్ల్యూఏ ఆధ్వర్యంలో మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికైంది. ఎన్‌ఐటీ (మెయిన్) ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం సాధించిన ఆమెకు రూ.16 వేల మెరిట్ స్కాలర్షిప్ చెక్కును ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య మంగళవారం అందజేశారు.

ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ..  శ్లోక రెడ్డి ఉన్నత విద్యలో మరింత ప్రతిభ కనబర్చి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఉద్యోగుల పిల్లల విద్యాభివృద్ధికి సింగరేణి యాజమాన్యం ఎల్లప్పుడూ ప్రోత్సాహంబి అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్.ఓ.టూ.జి.యం. రామస్వామి, డీజీఎం (పర్సనల్) అజ్మీర తుకారం, ఏరియా ఇంజనీర్ ఐ.వి.ఎస్.వి. లక్షణమూర్తి, జేకే-5 ఓసీ మేనేజర్ పులి పూర్ణచందర్ రావు, సేఫ్టీ ఆఫీసర్ శివ ప్రసాద్, ఎస్టేట్ అధికారి శివ వీర కుమార్, క్లర్క్ రవి తదితర అధికారులు పాల్గొన్నారు.