ఖమ్మం కలెక్టర్ గా టీఎస్ దివాకర్ ఐఏఎస్
26-04-2026 10:07 AM
ఖమ్మం టౌన్,(విజయక్రాంతి): తెలంగాణలో శనివారం జరిగిన ఐఏఎస్ ల బదిలీల్లో ములుగు జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న దివాకర్ ఖమ్మం కు బదిలీ అయ్యారు. ఈయన ములుగు జిల్లా కలెక్టర్ గా, ఐటిడిఏ, ఏటూరునాగారం ఇంచార్జ్ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూన్ 2024 నుండి ములుగు జిల్లా కలెక్టర్ గా పనిచేసారు. ఈయన కర్ణాటక కు చెందిన 2017 తెలంగాణ క్యాడర్ అధికారి. ఈయన బి ఈ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసారు. ఇటీవల జరిగిన మేడారం జాతరను సమర్ధవంతంగా నిర్వహించారు. అమ్మవార్ల గద్దెల పునర్ నిర్మాణంలో, జాతర ఏర్పాట్లలో ఈయన సమర్ధవంతంగా పనిచేసిన పేరుంది. ఖమ్మం కలెక్టర్ గా పనిచేసిన అనుదీప్ దురిశెట్టి తెలంగాణ ఐ టి ఈ & సి కి జాయింట్ సెక్రటరీ గా బదిలీ అయ్యారు.






