నేడు జనగామకు టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న రాక
10-05-2026 01:04 AM
మల్లన్న సమక్షంలో భారీగా చేరికలు
జనగామ, మే 9(విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ రా జ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదివారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. స్థానిక బాలాజీ నగర్ లోని జూబ్లీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు.
ఈ సందర్భంగా వి విధ పార్టీల నుంచి కీలక నేతలు, కార్యకర్తలు భారీగా తీన్మార్ మల్లన్న సమక్షంలో టీఆర్పీలో చేరనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రం లోని నిరుద్యోగ సమస్యలు,స్థానిక సామాజిక అంశాలపై మల్లన్న గళం విప్పనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కమిటీ పార్టీ పిలుపునిచ్చింది.






