ప్రత్యేక లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం
సెషన్స్ జడ్జి, చైర్మన్ కె.సాయి రమాదేవి
సికింద్రాబాద్, జూలై 18 (విజయక్రాం తి): ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా ఎక్కువ కేసులను పరిష్కరించడం జరిగిందని సెషన్స్ జడ్జ్ మరియు చైర్మన్ కె.సాయి రమాదేవి అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు, సభ్య కార్యదర్శి ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సెషన్స్ డివిజన్, నాంపల్లి, హైదరాబాద్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సికింద్రాబాద్ కోర్టు కాంప్లెక్స్లో ప్రత్యేక లోక్ అదాలత్ ప్రారంభ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సెషన్స్ డివిజన్, నాంపల్లి, హైదరాబాద్ సెషన్స్ జడ్జి మరియు చైర్మన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక లోక్ అదాలత్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న రాజీ చేయదగిన కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరిం చుకోవడానికి లోక్ అదాలత్ ఒక సులభమైన, సమర్థవంతమైన వేదికని అన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సెషన్స్ డివిజన్, నాంపల్లి, హైదరాబాద్ కార్యదర్శి పి.అ రుణ కుమారి మాట్లాడుతూ, ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సమయం మరియు ఖర్చు ఆదా కావడంతో పాటు, దీర్ఘకాలంగా కొనసాగుతున్న కేసులను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరిం చుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. అడిషనల్ సెషన్స్ జడ్జి జి.వేణు మాట్లాడుతు ప్రత్యేక లోక్ అదాలత్లో ముఖ్యంగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, సెక్షన్ 138 కింద నమోదైన చెక్ బౌన్స్ కేసులతో పాటు, రాజీ చేయదగిన ఇతర కేసులను కూడా ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు.
సికింద్రాబాద్ కోర్టు కాంప్లెక్స్, మనోరంజన్ కాంప్లెక్స్ మరియు నాంపల్లి కోర్టులలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్లో మొత్తం 2098 కేసులు, రికవరీ మొత్తం రూ.32,15,77, 247/- పరిష్కరించబడ్డాయి. శశాంక్ జడ్జి మరియు చైర్మన్ పరస్పర అంగీకారంతో కేసులు పరిష్కరించుకున్న కక్షిదారులకు రాజీ అవార్డులను అందజేశారు. కక్షిదారులకు అవార్డు కాపీలను అం దజేస్తూ, పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు.
ప్రత్యేక లోక్ అదాలత్ విజయవం తంగా నిర్వహించేందుకు సంబంధిత న్యా యస్థానాలు, న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, ప్రైవేట్ ఆర్థిక సంస్థల ప్రతినిధులు, పోలీసు అధికారులు, ఇతర సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయడం జరిగిందని అన్నా రు.
ప్రజలు అలాగే కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కొని, రాజీ చేయ దగిన కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకొని, న్యాయస్థానాలపై ఉన్న పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడంలో సహకరించాలని జిల్లా న్యా య సేవాధికార సంస్థ అధికారులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గౌరవ ఒకటవ అదనపు చీఫ్ జడ్జి చంద్రకిషోర్, ఇతర న్యాయమూర్తులు, సికింద్రాబాద్ కోర్టు బార్ ప్రెసిడెంట్ శ్రీ.సుధాకర్, న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, ప్రైవేట్ ఆర్థిక సంస్థల ప్రతినిధులు,కక్షిదారులు తదితర అధికారులు పాల్గొన్నారు.






