ఉప్పల్ బగాయత్‌లో బైక్ రేసింగ్ చేస్తున్న యువకులపై పోలీసుల చర్య
18-07-2026 09:35 PM
ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో ప్రమాదకరంగా బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న యువకులను ఉప్పల్ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై సంబంధిత చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. యువత నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున, పోలీస్ అధికారులు వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని, బైక్ రేసింగ్ వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని యువకులకు సూచించారు. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉప్పల్ పోలీసులు హెచ్చరించారు.






