చెక్ బౌన్స్ కేసుల్లో రాజి మార్గమే ఉత్తమం
18-07-2026 09:32 PM
- జూనియర్ సివిల్ జడ్జి వి. మాధవి
మెట్ పల్లి,(విజయక్రాంతి): చెక్ బౌన్స్ కేసుల్లో రాజీ చేసుకోవడమే ఉత్తమం అని మెట్ పల్లి జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి అన్నారు. శనివారం మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, చెక్ బౌన్స్ లాంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కేసుల్లో కంటెస్టింగ్ కన్నా, రాజీ చేసుకోవడానికే కక్షిదారులు ప్రయత్నించాలని సూచించారు. కేసుల్లో పరస్పరం రాజీ పడటం వలన సమయంతో పాటూ, ఖర్చులూ ఆదా అవుతాయాని అన్నారు. శనివారం జరిగిన ప్రత్యేక లోక్ అదాలత్ లో పదిహేను పెండింగ్ కేసుల్ని రాజీ ద్వారా పరిష్కరించినట్టు తెలిపారు. ఈ లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేసిన పోలీసులకు, సహకరించిన న్యాయవాదులకు ధన్యవాదములు తెలిపారు.






