మహిళా సర్పంచులకు బదులు భర్తలు, కుమారులు, బంధువులు
మండల ప్రత్యేక అధికారి సాక్షిగా సమావేశానికి హాజరైన మహిళా సర్పంచుల బంధువులు
నోరు మెదపని అధికారులు
మహిళా సర్పంచులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పలువురు ఆగ్రహం
కుభీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో శనివారం "వర్షాభావ పరిస్థితులు-తీసుకోవాల్సిన జాగ్రత్తలు" అనే అంశంపై ఎంపీడీవో అక్కల్ దేవి శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మండల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఏ ఈ ఓ లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టి ఏ లతో నిర్వహించిన ప్రత్యేక అధికారిక సమావేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మహిళా సర్పంచులకు బదులు వారి భర్తలు, కుమారులు, మామలు, బంధువులు హాజరై సమావేశంలో పాల్గొన్న చర్చనీయాంశంగా మారింది.
సమావేశానికి దర్జాగా హాజరై చర్చల్లో పాల్గొనడం పట్ల ద్వితీయ శ్రేణి అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. మహిళా సర్పంచులకు ఇచ్చే గౌరవం ఇదేనా జిపి కార్యాలయాల్లో సైతం సర్పంచ్ కుర్చీలో భర్తలు వారి బంధువులు కూర్చుని సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయా గ్రామాల ప్రజలు. మండల అధికారులు కూడా ఈ విషయంపై పెద్దగా పట్టించుకోవడంలేదని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. కాగా ఈరోజు ఈ సమావేశానికి మహిళా సర్పంచులకు గదులు హాజరైన హల్డా సర్పంచ్ కొనింటి రజితకు బదులు ఆమె భర్త దేవేందర్ హాజరయ్యారు.
అలాగే జామగాం సర్పంచ్ నవనీతకు బదులు భర్త సంజీవ్, సాంగ్వి సర్పంచ్ జరి లక్ష్మికి బదులు భర్త బొజేందర్, రంజిని తండా సర్పంచ్ కవితా బాయికి బదులు ఆమె బంధువు రంగారావు, పాముల సర్పంచ్ భారతిబాయి కి బదులు ఆమె కుమారుడు దిగంబర్, రామ్ నాయక్ తండ సర్పంచ్ వందనా బాయి కి బదులు ఆమె భర్త బిక్కులాల్, మాలిగాం సర్పంచ్ శేల్కె లక్ష్మీబాయికి బదులు ఆమె భర్త శేల్కె ఆనంద్, చొండి సర్పంచ్ క్రాంతిబాయి కి బదులు ఆమె భర్త రాజు, సిరిపెల్లి సర్పంచ్ కల్పనాబాయి కి బదులు ఆమె కుమారుడు బాలాజీ తో పాటు పలురు హాజరయ్యారు. ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి మహిళా సర్పంచుల హక్కులకు భంగం.






