‘ఉప్పల’ దంపతుల దాతృత్వం
పేదింటి ఆడపిల్లల వివాహానికి పుస్టె మట్టెలు అందజేత
నాగోల్, మే 9 (విజయక్రాంతి): నాగోల్‌లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా, ఐవీఎఫ్ ప్రధమ మహిళ ఉప్పల స్వప్న ముగ్గురు పేదింటి ఆడపిల్ల వివాహానికి పుస్తెమట్టెలు అందజేశారు.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం సిరసముందర్ గ్రామానికి చెందిన నీరడి అంజవ్వ, నీరడి యాదరావ్ దంపతుల కుమార్తె సాత్విక కు, మేడ్చల్ జిల్లా షామీర్‌పేటకు చెందిన రాపాని ఎల్లయ్య, -యాదమ్మ కుమార్తె లలిత కు, ఓల్డ్ మలక్ పేటకి చెందిన ఎడ్ల అనురాధ, ఎడ్ల ఈశ్వర్ కుమార్తె శివాని వివాహానికి అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ఉప్పల ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే తుంకుంట నర్సిరెడ్డి, ఆర్య వైశ్య సంఘం నాయకులు కొలిపాక నారాయణ, దివదీనమ్, భద్రాద్రి, భద్రకాళి టెంపు ల్ డైరెక్టర్ వీరన్న, నరేష్ గుప్త, ప్రవీణ్ గుప్త, శ్రీధర్ గుప్త పాల్గొన్నారు.






