10 June, 2026 | 3:40 AM

డీకేను వీడని చిక్కులు

10-06-2026 12:00 AM
  1. కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం
  2. మంత్రిత్వ శాఖల కేటాయింపుపై పెదవి విరుపు
  3. వరుసగా ఢిల్లీ బాట పడుతున్న ఎమ్మెల్యేలు

బెంగళూరు, జూన్ ౯: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత అసంతృప్తి మళ్లీ మొ దలైంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్‌కు ఆదిలోనే హంసపాదు ఎదు రైంది. ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన మంత్రిత్వశాఖలపై పెదవి విరుస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల తో భేటీ అయ్యేందుకు క్యూ కడుతు న్నారు. వీరిలో బెంగళూరు అభివృద్ధిశాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ ఒకరు.

ఈయన అధికారికంగా మంత్రి బాధ్యతలు స్వీకరించకపోయినప్ప టికీ, ఇప్పటికే కేటాయించిన శాఖతోపాటు బెంగళూరు అభివృద్ధి అథారిటీ, బెంగళూరు మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీని కూడా తన శాఖ పరిధిలోకి తీసు కురావాలని పట్టబట్టి హస్తిన బాట పట్టారు. ఇదే బాటలో ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ ఉన్నారు. తనకు మంత్రివర్గంలో తనకు చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ పెద్దలతో భేటీకి సిద్ధమయ్యారు. కొద్దిరోజుల ముందు సీనియర్ నేత రామలింగారెడ్డితో తలెత్తిన వివాదాన్ని సీఎం అటో ఇటో సద్దుమణిగేలా చేశారు.

మొదట నీటిపారుద లశాఖ అప్పగించగా, తనకు ఆ శాఖ వద్దని రామలింగారెడ్డి భీష్మించుకు కూర్చు కున్నారు. తనకు బెంగళూరు అభివృద్ధి శాఖ కావాలని పట్టుబట్టారు. దీంతో సీఎం రం గంలోకి దిగి బుజ్జగించి ఆయన్ను దారిలోకి తీసుకొచ్చారు. ఏదేమైనా ఎమ్మెల్యేలు, సీఎం మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించి, ప్రభు త్వాన్ని కాపాడుకునేందుకు హైకమాండ్ మరోసారి రంగంలోకి దిగాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది.