13 August, 2026 | 6:49 PM

గజ్వేల్‌లో అహల్యాబాయి హోల్కర్‌కు ఘన నివాళి

13-08-2026 05:23 PM

గజ్వేల్: లోకమాత అహల్యాబాయి హోల్కర్‌ శివైక్యం చెందిన దినం సందర్భంగా గజ్వేల్‌లోని ఆమె విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆకుల నరేష్‌బాబు మాట్లాడుతూ... అహల్యాబాయి హోల్కర్‌ మహిళా సాధికారత, సుపరిపాలన, ధర్మ సంస్కృతుల పరిరక్షణకు విశేష కృషి చేసి ఆదర్శంగా నిలిచారని అన్నారు. రైతులు, కార్మికుల సంక్షేమం, వితంతువుల అభ్యున్నతికి అనేక సంస్కరణలు చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.