13 August, 2026 | 7:05 PM

ఆయిల్ ఫామ్ తో అధిక లాభాలు

13-08-2026 06:08 PM

ఏడిఏ సుధమాధురి

సదాశివనగర్,(విజయక్రాంతి): రైతులకు ఆయిల్ ఫామ్ పంట సాగు వల్ల అధిక లాభాలు ఆశించవచ్చు అని ఎల్లారెడ్డి ఏడిఏ సుధామాధురి  అన్నారు. ఈ మేరకు మండలంలోని అడ్లూర్ ఏల్లారెడ్డి గ్రామంలో గల ఆయిల్‌పామ్ తోటలను సందర్శించారు. ఆయిల్‌పామ్ పంట కోతను పరిశీలించి, ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులతో మాట్లాడారు. అలాగే ఇతర రైతులను సమీకరించి, ఆయిల్‌పామ్ సాగు చేపట్టేలా వారిని ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఆయిల్‌పామ్ సాగు విధానం, సాగు వల్ల కలిగే ప్రయోజనాలు మరియు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్న రాయితీల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి , AEO అడ్లూర్ ఎల్లారెడ్డి కళ్యాణి మరియు అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ రైతులు పాల్గొన్నారు.