వెటర్ని హాస్పటల్లో గొర్రెల, మేకలకు సరిపడా మందులు ఇవ్వాలి
- సంఘం జిల్లా కార్యదర్శి కాట్రాల తిరుపతిరావు
దమ్మపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో జరిగిన గొర్రెల, మేకల పెంపకం దారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి కాట్రాల తిరుపతిరావు పాల్గొని మాట్లాడుతూ గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం ఈనెల ఆగస్టు 20న సుజాతనగర్ లో జరిగే జిల్లా 4వ మహాసభలను జయప్రదం చేయాలి.
ఈ జిల్లా మహాసభలు కు దమ్మపేట మండల గొర్రెల కాపరులు అందురూ హాజరయి కార్యక్రమం విజయ వంతం చేయాలని కోరారు. దమ్మపేట వెటర్ని హాస్పటల్లో గొర్రెల, మేకలకు సరిపడా మందులు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టును, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి గొర్రెల సహకార సంఘానికి గొర్రెల మేతకు 20 ఎకరాల భూమిని కేటాయించాలి.
గొర్రెలకు, మేకలకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని, గొర్రెల కాపరలలో చదువుకున్న నిరుద్యోగ యువతకు 30 లక్షల తో గొర్రెల ఫామ్కు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జంగిలి వెంకటరత్నం, తెల్లమేకల వెంకటేశ్వర్లు, కంపాసాటి వెంకన్న, మాదాల మహేష్, పదిమల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






