ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి
ఎమ్మార్వోకు ఉపాధ్యాయుల వినతి
మునిపల్లి,(విజయక్రాంతి): ఉపాధ్యాయులన్యాయమైన డిమాండ్లు (సమస్య)లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక తహసీల్దార్ రంగరావుకు ఉపాధ్యాయులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు నీలి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి గల్ల సంతోషమ్మలు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు రావల్సిన డీఏ బకాయిల విడుదలతోపాటు పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు మెమో -57 అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఇతర ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా చేపట్టే కార్యక్రమాలను సక్సెస్ చేయాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు లక్ష్మణ్, గోవర్థన్, నాగేశ్వర్, వీరయ్య, ఖాజా, దుర్గయ్య పాల్గొన్నారు.






