13 August, 2026 | 6:48 PM

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నోట్‌బుక్స్‌ పంపిణీ

13-08-2026 05:24 PM

గజ్వేల్: ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా గురువారం గజ్వేల్ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో విద్యార్థినులకు నోట్‌బుక్స్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ డా. సీహెచ్‌ జ్యోతిర్మయి, అధ్యాపకులు, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే నోట్‌బుక్స్‌ అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.