13 August, 2026 | 7:06 PM

కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు

13-08-2026 06:06 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలోని సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి సోదరుడు దేవరకొండ మురళి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మురళి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు దేవరకొండ నరసింహచారి, రాజయ్య, దశరథరెడ్డి,వంగపల్లి శ్రీనివాస్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.