8 June, 2026 | 9:33 PM

Breaking News

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెను భారం మోపుతున్న మోదీ సర్కార్   •   పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలి   •   చింతకుంటలో కేత్ బచావో- భూమి సంరక్షణ కార్యక్రమం   •   సమస్యలను తెలుసుకున్నందుకే బుల్లెట్ పై ప్రయాణం   •   తాజా మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్ రోడ్డు ప్రమాదంలో మృతి   •   కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తే బీఆర్ఎస్ చేర్చుకుంది   •   పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి   •   ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి   •   పోలంపల్లి చెరువులో అనుమతుల ముసుగులో మట్టి మాఫియా   •   కాలనీలో నూతన నీటి పైపులైన్ ఏర్పాటుచేసి, తాగునీటి సరఫరాను మెరుగుపరచాలి   •  

పోలంపల్లి చెరువులో అనుమతుల ముసుగులో మట్టి మాఫియా

08-06-2026 08:22 PM

పర్మిషన్లు పొందిన రైతుల నుండి ట్రిప్పుకు భారీగా వసూళ్లు

అధికారుల పర్యవేక్షణ లేక అక్రమ దందాకు రెక్కలు..!

కారేపల్లి,(విజయక్రాంతి): సింగరేణి మండలం పోలంపల్లి గ్రామపంచాయతీలో ఇరిగేషన్ శాఖ అధికారుల నుండి అనుమతులను అడ్డుపెట్టుకుని కొందరు మట్టి దందాదారులు యథేచ్ఛగా త్రవ్వకాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సంబంధం లేని వ్యక్తులకు పర్మిషన్లు ఇచ్చి మట్టి దందాలకు ఏ విధంగా అనుమతులు ఇస్తున్నారు తెలియాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భాగ్యనగర్ తండా గ్రామానికి చెందిన గూగులోత్ బాబురావు అనే వ్యక్తికి ఏ విధంగా అధికారులు పర్మిషన్ ఇచ్చారోతెలియాల్సి ఉంది.

అలాగే పరిమిషన్లు తెచ్చుకున్న రైతులు ఒక్కో ట్రిప్పుకు ఎనిమిది వందల రూపాయల చొప్పున వారికి ఇస్తూ తీవ్రమైన నష్టాన్ని మూటగట్టుకుంటున్నారు.ఒక ప్రాంతానికి, ఒక పరిమితికి మాత్రమే ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి భారీ స్థాయిలో మట్టి తరలింపు జరుగుతోందని స్థానికులు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం ఫీటు నుంచి రెండు ఫీట్ల వరకు లోతు తీయాల్సి ఉండగా చెరువులో తమ ఇష్టానుసారంగా బావులను తలపించే విధంగా త్రవ్వకాలను జరుపుతూ నిబంధనలకు విరుద్ధంగా మట్టి దందాలు జోరుగా కొనసాగిస్తూ ట్రిప్పుకు 600 నుంచి 800 రూపాయలు వసూలు చేస్తున్నారు.

మట్టి తవ్వకాల పేరుతో  బావులను తలపించే విధంగా లోతుగా తవ్వేస్తుండటంతో భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్రవ్వకాలు పూర్తయిన తర్వాత  వర్షాకాలంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు.అనుమతులు జారీ చేసే సమయంలో కఠిన నిబంధనలు విధిస్తున్న అధికారులు, వాటి అమలును పరిశీలించడంలో మాత్రం విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

క్షేత్రస్థాయిలో తనిఖీలు లేకపోవడంతో అక్రమ మట్టి దందా మరింతగా విస్తరిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మట్టి తరలింపులో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతుండగా, కొందరు దందాదారులు మాత్రం వేల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ త్రవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.