26 April, 2026 | 1:10 PM

ఖమ్మంపల్లి టూ భూపాలపల్లికి ప్రయాణం ఇక సులభం

26-04-2026 11:30 AM

కిషన్ రావు పల్లె అటవీ ప్రాంతం నుండి భూపాలపల్లికి పూర్తయిన మట్టి రోడ్డు

ప్రయాణికులకు రైతులకు  తీరనున్న ప్రయాణ కష్టాలు

మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టితో కొనసాగుతున్న దశబ్దాల రోడ్డు పనులు

ఆనందం వ్యక్తం చేస్తున్న భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల ప్రజలు

మంథని,(విజయక్రాంతి): ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి నుండి భూపాలపల్లికి ప్రయాణం ఇక సులభం తరం కానుంది. భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలంలోని కిషన్ రావు పల్లె నుండి అటవీ ప్రాంతం నుంచి భూపాలపల్లికి మట్టి రోడ్డు పూర్తి అయ్యింది. దీంతో పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా ప్రయాణికులకు, రైతులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. రాష్ట్ర ఐటీ, అసెంబ్లీ వ్యవహారాలు,  పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టితో దశబ్దాల రోడ్డు పనులు ప్రారంభం కావడంతో మంథని, ముత్తారం, మల్హర్ మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మంథని పట్టణం నుంచి భూపాలపల్లి దాదాపు 60 కిలోమీటర్ల దూరం ఉండడంతో ప్రయాణం ప్రయాణికులకు ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మంథని,  ఖమ్మంపల్లి మీదుగా తాడిచర్ల, పెద్దతుండ్ల, కిషన్ రావుపల్లె  మీదుగా అటవీ ప్రాంతం నుండి నేరుగా భూపాలపల్లికి తక్కువ సమయంలో చేరుకోవచ్చు. దీంతో దాదాపు ప్రయాణికులకు 20 కిలోమీటర్ల మేర ప్రయాణం భారం తగ్గనుంది. కిషన్ రావు పల్లి నుంచి అటవీ శాఖ అనుమతులు తీసుకువచ్చి, రోడ్డు మంజూరు చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు రెండు జిల్లాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.