నేల ఆరోగ్యంపై అధ్యాపకులకు శిక్షణ
ఘట్ కేసర్, జూన్ 24 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో వాతావరణ మార్పు లు, జల వనరులు, నేల ఆరోగ్యం, పర్యావర ణ సుస్థిరతపై చూపుతున్న ప్రభావాలు అనే అంశంపై వారం రోజుల అధ్యాపకుల శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైం ది. ఈకార్యక్రమం స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి. విజయ్ కుమార్ మార్గదర్శకత్వంలో నిర్వహించబడుతోంది. సివిల్ ఇం జినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పల్లవి బాద్రి కార్యక్రమానికి నాయకత్వం వహిస్తుండగా, డాక్టర్ గుమ్మడి వెంకటరావు, డాక్టర్ మధుసూదన్ రెడ్డి కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు.
వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా జల వనరులు, వ్యవసా య భూ ముల ఉత్పాదకత, నేల నాణ్యత మరియు పర్యావరణ సమతుల్యతపై ఏర్పడుతున్న ప్రభావాలపై ఈ శిక్షణా కార్య క్రమంలో సమగ్ర చర్చలు జరుగుతున్నాయి. ప్రకృతి వనరుల సంరక్షణ, సుస్థిర అభివృ ద్ధి, పర్యావరణ పరిరక్షణ మరియు ఆధునిక సాంకేతి క పరిజ్ఞానాల వినియోగంపై నిపుణులు త మ అనుభవాలను, పరిశోధన ఫలితాలను పంచుకుంటున్నారు. సుస్థిర ఇంజినీరింగ్ విధానాలను ప్రో త్సహిస్తూ, అధ్యాపకులు మరియు పరిశోధకుల సామర్థ్యాభివృద్ధికి అనురాగ్ యూనివర్సిటీ నిరంతరం కృషి చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.






