21 July, 2026 | 4:39 AM

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం!

20-07-2026 11:34 AM

​రంగారెడ్డి,జులై 20(విజయక్రాంతి): తోటి మహిళా అధికారితో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి(Trainee IPS officer Uday Krishna Reddy) హైదరాబాద్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.​సమాచారం అందుకున్న వెంటనే ఆయనను ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

​తీవ్రమైన ఆరోపణలు: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ లో శిక్షణ పొందుతున్న సమయంలో, ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై వేధింపులు, బెదిరింపులకు పాల్పడినట్లు ఉదయ్‌పై ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ అంశంపై విచారణ చేపట్టిన అంతర్గత విచారణ కమిటీ, మహిళా అధికారి చేసిన ఆరోపణల్లో నిజముందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది.​కేసు నమోదు, విచారణ కమిటీ నిర్ధారణతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉదయ్ కృష్ణారెడ్డి ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశారు.