13 July, 2026 | 5:33 PM

Breaking News

కళాకారుల విభాగం నియోజక వర్గం అధ్యక్షుడిగా ఎనగందుల దత్తు   •   గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన విద్యార్థులను అభినందనలు   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •  

ముకుందాపూర్ లో విషాదం..

05-10-2025 07:32 PM

ఈతకు వెళ్లి చెరువులో మునిగి యువకుడు మృతి..

తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముకుందాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ముద్దయిపేట చెరువులో ఈతకు వెళ్లిన చినావత్ సునీల్ కుమార్(18) అనే యువకుడు చెరువులో ఈ ఒడ్డు నుండి అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి ప్రయత్నించి మధ్యలో నీటి ఉధృతికి తట్టుకోలేక నీట మునిగి మృతి చెందాడు. చేతికి అంది వచ్చిన కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు, స్నేహితుల రోదన మిన్నంటింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.