10 July, 2026 | 1:04 AM

డీఏపీ లేదంటూ... పీఏపీ బస్తాపై ధర పెంచి.. విక్రయిస్తున్న వ్యాపారులు

09-07-2026 05:27 PM

డిఎపి కోసం ఎదురుచూస్తున్న  గిరిజన రైతులు..

ఉట్నూర్, జూలై 9 (విజయక్రాంతి):  గత ఏడాది  ఖరీఫ్ పంటల సాగులో(Kharif crop cultivation)  యూరియా అందక  ఇబ్బందులు పడిన రైతులు... ఈసారి ఖరీఫ్ పంటలు  సాగు చేసిన రైతులు  డీఏపీ విషయంలోనూ  అజయ్ పరిస్థితిని  ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ వ్యాపారులు  రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని  అధిక ధరకు అమ్ముతూ  మరింత పీడిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే  డీఏపీ లేదని.. కంపెనీల నుంచి రావడం లేదంటూ  కృత్రిమ కొడతాను సృష్టిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఎరువుల వ్యాపారులు  అక్రమార్చనకు  దిగుతున్నారని   గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీఏపీ విషయంలో  వ్యవసాయ అధికారులను అడిగితే డీఏపీ ఎప్పుడు వస్తుందో  తమకు తెలియడం లేదని  జవాబులు చెబుతున్నారని   రైతులు వాపోతున్నారు.

రైతులు సాగు చేసే పంటల కు ఈ సమయంలో  ఎలాంటి ఎరువులు వేయాలి, ఈ సమయంలో పురుగు మందులు వాడాలో  సూచనలు ఇచ్చేందుకు సైతం  వ్యవసాయ శాఖ అధికారులు  సూచనలు సలహాలు ఇవ్వడం లేదని  రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు  యూరియా తీసుకున్నందుకు  ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్ లో  సర్వే నంబర్లు చూపించడం లేదని, యూరియా తీసుకోవాలన్న  తిరువవలసిన పరిస్థితి ఏర్పడుతుందని  రైతులు అంటున్నారు. యూరియా డిఏపితోపాటు  ఇతర రసాయన ఎరువులు  కొనుగోలు చేయాలంటే  వాటి ధర సైతం  చుక్కలు అంటుతున్నాయని  రైతులు వాపోతున్నారు. 20:20:0, 20:20:13 ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే వ్యాపారులు ఎక్కువ దొరికే అమ్ముతున్నారని  రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఎరువుల కోసం సైతం  ఎరువుల వ్యాపారుల వద్ద  వేచి ఉండవలసిన పరిస్థితి ఉందని రైతులు తెలిపారు.

ఒక బస్తా 2100 కు పైగానే..

మడవి  షేకు, గిరిజన రైతు, పోచంపల్లి, సిరికొండ మండలం..

 తమకు దగ్గరలో ఉన్న ఇంద్రవెల్లి మార్కెట్ నుండి ఎరువులు కొనుగోలు చేస్తామని రైతు మడవిషకు తెలిపారు. 20:20:13 ఎరువు బస్తా  2100 కు పైగానే  విక్రయిస్తున్నారు. గత ఏడాది ఎరువు బస్తా 1300 రూపాయలకు కొనుగోలు చేశాను. ఈసారి ఎరువులను  కొనుగోలు చేసేందుకు వ్యాపారుల వద్దకు వెళ్లిన  సమయంలో దారి చెప్పితే  మూర్ఛ వ్యాధి వస్తుందని  వాపోయారు. పోచంపల్లి పంచాయతీ రైతులకు సిరికొండ మండల కేంద్రంలో యూరియా బస్తాలు ఇస్తున్నారని, తమ గ్రామం నుండి  మండల కేంద్రానికి వెళ్లే వరకు యూరియా బస్తాలను  వేరే రైతులు కొనుగోలు చేసుకుని వెళ్తున్నారని  అన్నారు. పోచంపల్లి పంచాయతీ  రైతులకు ఇందరవెల్లిలో యూరియా తీసుకునే వెసులుబాటు కల్పించాలని  ఆయన కోరారు.