calender_icon.png 5 February, 2026 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ బోల్తా

05-02-2026 12:00:00 AM

డ్రైవర్‌కి తీవ్ర గాయాలు..

ఆళ్ళపల్లి ,ఫిబ్రవరి 4,(విజయక్రాంతి): ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ కి తీవ్ర గాయాల పాలైన ఘటన మండల పరిధిలోని రామంజి గూడెంలో బుధవారం చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మర్కోడు గ్రామానికి చెందిన కంచర్ల రవికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పడిగా సూర్యప్రకాష్ ఆళ్లపల్లి వచ్చి తిరిగి అడవిరామువారం వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బోల్తా పడి తీవ్ర గాయాల పాలయ్యాడు.

కొత్తగూడెం నుండి కరకగూడెం వెళుతున్న మాజీ శాసనసభ్యులు రేగ కాంతారావు అక్కడే ఉన్న స్థానికులు గమనించి క్షతగాత్రుడిని 108 వాహనం ద్వారా రాళ్లపల్లి ప్రాథమిక వైద్యాలకు తరలించడం జరిగింది. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం జరిగింది. స్థానిక ఎస్త్స్ర సోమేశ్వరరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.