05-02-2026 12:00:00 AM
కరీంనగర్, ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. బుధవారం సిపి గౌస్ ఆలంతో కలిసి జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గుమ్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం, హెలిపాడ్, పార్కింగ్ స్థలాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులతో వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.