20 June, 2026 | 2:41 AM

చేనేత కుటుంబానికి ప్రజా ప్రభుత్వం చేయూత

20-06-2026 01:22 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కాంగ్రెస్‌లో చేరిన చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గం

వేములవాడ జూన్ 19 (విజయక్రాంతి): వేములవాడ చేనేత పారిశ్రామిక సహకార సంఘం నూతన అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు తాటికొండ రాజయ్య, కార్యదర్శి పారవెల్లి రాజేశం, కోశాధికారి రాపెల్లి దేవదాసు, కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చేనేత కార్మికుల బకాయిలు విడుదల చేయడంతో పాటు వేములవాడలో రూ.50 కోట్లతో యార్న్ డిపో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చేనేత ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ప్రభుత్వం ఆర్డర్లు ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, పట్టణ అధ్యక్షుడు తుమ్ మధు, కౌన్సిలర్ కొక్కుల బాలకృష్ణ, ఇప్పపూల అజయ్, దూసా రాజేశం, పులి సత్యనారాయణ, తాటికొండ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.