1 September, 2026 | 2:09 AM

టీపీఎస్ అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు వరం

01-09-2026 01:24 AM

డాక్టర్ శ్రీకాంత్ వేముల 

మాదాపూర్‌లోని సోలేషియం సెంటర్‌లో ఏర్పాటు

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): అల్జీమర్స్.. డిమెన్షియాతో బాధపడుతున్న వారికి చికిత్స లేదనుకునేవారు. కానీ ఇప్పుడు అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు జర్మనీకి చెందిన ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన టీపీఎస్ (ట్రాన్స్ క్రేనియల్ పల్స్ స్టిమ్యులేషన్) టెక్నాలజీ అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు వరం లాంటిదని ప్రముఖ న్యూరాలజిస్ట్, సొలేషియం సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీ కాంత్ వేముల తెలిపారు.

సోమవారం మాదాపూర్‌లోని సొలేషియం సెంటర్‌లో ఈ ఆధునిక టెక్నాలజీని జర్మనీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఉల్రిచ్ స్ప్రిక్‌తో కలిసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ వే ముల మాట్లాడుతూ అల్జీమర్స్, డిమెన్షియా వస్తే చికిత్స లేక బాధపడేవారు.

కానీ ఈ నా న్ ఇన్వేజివ్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ టెక్నాలజీతో మెదడు లోపలికి ఎలాంటి పరికరాలను పంపించకుండానే బయటనుంచే ఈ పరికరంతో మెదడులో దెబ్బతిన్న నరాలను ప్రేరేపించడం ద్వారా ఆ నరాలు ప్రేరేపితం కావడంతో కోల్పోయిన జ్ఞాపకశక్తి తిరిగి రావడం, రోజు వారి కార్యక్రమాల్లో చాలా వరకు బెటర్ అవుతారని తెలిపారు. ఈ టెక్నాలజీని ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని సెంటర్లలో ఉపయోగిస్తున్నారని, భారత్‌లో మొదటి సారిగా హైదరాబాద్, హైటెక్ సిటిలోని సోలేషియం సెంటర్లో అందుబాటులోకి తీసువచ్చామని తెలిపారు. ఈ టెక్నాలజీ వల్ల అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు అద్భుతంగా పనిచేస్తుందని ప్రొఫెసర్ డాక్టర్ ఉల్రిచ్ స్ప్రిక్ తెలిపారు.