27 July, 2026 | 2:45 AM

రామప్పను సందర్శించిన టూరిజం ఇన్‌ఫ్లుయెన్సర్లు

27-07-2026 01:45 AM

వెంకటాపూర్, జులై 26 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయాన్ని ఆదివారం పలువురు టూరిజం ఇన్‌ఫ్ల్లుయెన్సర్లు సందర్శించారు. ఈ సందర్భంగా దేవాలయ విశిష్టత, కాకతీయుల శిల్పకళా వైభవం, చారిత్రక ప్రాముఖ్యత గురించి తెలుసుకుని ఆలయ అందాలను తమ కెమెరాల్లో బంధించారు.

వారికి టూరిజం గైడ్ విజయ్ ఆలయ విశేషాలను వివరించారు. పర్యాటకులను ఆకర్షించేలా రామప్ప దేవాలయాన్ని మరింతగా ప్రచారం చేయడంలో ఇటువంటి టూరిజం ఇన్ఫు్లయెన్సర్ల సందర్శనలు దోహదపడతా యని అధికారులు తెలిపారు. వారి వెంట తహసీల్దార్ గిరిబాబు, ఈవో భాస్కర్, ఆర్‌ఐ రమేష్, కలెక్టర్ సీసీ నాగరాజు, హరిత హోటల్ మేనేజర్ రంజిత్, టూరిస్ట్ పోలీసులు శ్రీకాంత్, బద్రు, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.