17 June, 2026 | 4:36 AM

21న తెలంగాణలో పీసీసీ అగ్రనేతల పర్యటన

17-06-2026 12:51 AM

మక్తల్, ఆందోల్‌లో పర్యటించనున్న మీనాక్షి, మహేష్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): ఎస్‌ఐఆర్ పై బీఎల్‌ఏలకు శిక్షణ ఇచ్చేందుకు పీసీసీ అగ్రనేతలు నియోజకవర్గ పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈ నెల 21 నుంచి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ వ్యవహరాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నియోజకవర్గ పర్యటనలు చేయబోతున్నారు.

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐర్)పై బూత్ లెవెల్ ఏజెంట్లకు (బీఎల్‌ఏ)  ఇచ్చే ప్రత్యేక శిక్షణలో అగ్రనేతలు ఇద్దరూ పాల్గొననున్నారు. ఈ నెల 21న మక్తల్, 23న ఆందోల్ నియోజకవర్గంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా,  సర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇదివరకే సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు.

అనుమానాస్పదం పేరుతో ఓట్లు తొలగించే ప్ర యత్నం జరుగుతోందని, ఓట్లు తొలగిస్తే రాజకీయంగా ప్రమాదకర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని, పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ అగ్రనేతలు నియోజకవర్గాల పర్యటనలకు వెళ్లడం ఆసక్తిగా మారింది.