23 May, 2026 | 1:27 AM

టూత్ విష్ హాస్పిటల్ ప్రారంభం

23-05-2026 12:35 AM
  1. ఖాజాగూడలో అత్యాధునిక సౌకర్యాలతో రౌండ్ ది క్లాక్ దంత వైద్య సేవలు
  2. డాక్టర్లు స్రవంతి ఎల్లసిరి, రవిశంకర్ రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, మే 22(విజయక్రాంతి): భారతదేశపు తొలి 24/7 డెంటల్ హాస్పిటల్‌గా టూత్ విష్ 24/7 డెంటల్ హాస్పిటల్ శుక్రవారం ఖాజాగూడలో ఘనంగా ప్రారంభమైంది. ఈఏపీఎల్ శ్రీ తిరుమల హబ్ 9, ఎస్‌బీఐ బ్యాంక్‌పై అంతస్తులో ఏర్పాటు చేసి న ఈ అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్‌ను ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ స్రవంతి ఎల్లసిరి, కోఫౌండర్ అండ్ ఎండీ డాక్టర్ రవిశంకర్ రాథోడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైద్యులు, అతిథులు, కు టుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు తదితరు లు హాజరయ్యారు. భారతదేశంలోనే తొలి 24 గంటల డెంటల్ హాస్పిటల్‌గా టూత్ విష్ ప్రారంభం కావడం దంత వైద్య రంగం లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిం ది.

అత్యవసర దంత వైద్య సేవలతో పాటు ఆధునిక చికిత్సలు, సానుభూతితో కూడిన సేవలు, పేషెంట్ కంఫర్ట్,  ప్రపంచ స్థాయి డెంటల్ కేర్‌ను ఒకే చోట అందించడమే ఈ హాస్పిటల్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ స్రవంతి ఎల్లసిరి మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో పాటు మానవీయ విలువలను కలిపి భారతదేశంలో కొత్త తరహా డెంటల్ కేర్ అ నుభవాన్ని అందించబోతున్నాం అన్నారు. డాక్టర్ రవిశంకర్ రాథోడ్ మాట్లాడుతూ, ప్రతి చిరునవ్వు వెనుక ఒక ప్రత్యేక కథ ఉం టుంది. ఆ చిరునవ్వును ఆరోగ్యంగా, అందం గా, ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్దడం మా బా ధ్యతగా భావిస్తున్నామని, దంత వైద్య సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నాం అన్నారు.