23 May, 2026 | 1:31 AM

బీమా సొమ్ముకోసం భార్యను చంపిన భర్త?

23-05-2026 12:36 AM
  1. అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలు
  2. ఖమ్మం జిల్లా గోల్ తండాలో ఘటన

తిరుమలాయపాలెం, మే 22 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోల్ తండాలో చోటుచేసుకున్న ఓ దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్నవాడే భార్యను చిత్రహింసలకు గురిచేసిన హ త్య చేసిన సంఘటన తండాలో సంచలనం కలిగించింది.  ఇంటిపై ఉన్న భారీ అప్పులు, భార్య పేరుమీద ఉన్న కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఈ హత్య జరిగి ఉండొచ్చని మృతురాలి బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల మేరకు తిరుమలాయపాలెం మం డలం పాతర్లపాడు స్టేజి సమీపంలోని గోల్ తండాకు చెందిన బానోత్ శివాజీ, మీనాక్షిలు సుమారు 14 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. కొంతకా లంగా కుటుంబంలో తరచూ గొడవలు జ రుగుతున్నాయని, శివాజీ ప్రవర్తనలో మా ర్పు వచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇటీవల ఇంటిపై దాదాపు 80 లక్షల రూపాయల అప్పులు పెరిగినట్లు సమాచారం. అదే సమయంలో మీనాక్షి పేరుమీద భారీ ఇ న్సూరెన్స్ పాలసీ కూడా ఉన్నట్లు గ్రామస్తు లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే డ బ్బుల కోసం శివాజీ తన భార్యను మానసికంగా, శారీరకంగా వేధించేవాడని బంధువు లు ఆరోపిస్తున్నారు.

గతంలో కూడా మీనాక్షిని కింద పడేసి పిడిగుద్దులతో దారుణంగా కొట్టిన ఘటనలు జరిగాయని సమీప బంధువులు చెబుతున్నారు. గురువారం రాత్రి మ రోసారి భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో శివాజీ మీనాక్షిని తీవ్రంగా కొట్టడంతో ఆమె స్పృహ తప్పిందని, అనంతరం చున్నీతో ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించా డని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఘటన వెలుగులోకి రావడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

ఇద్దరు చిన్నారులు తల్లి మృతదేహం వద్ద విలపించడం అక్కడు న్న వారిని కంటతడి పెట్టించింది. సమాచా రం అందుకున్న తిరుమలాయపాలెం ఎస్‌ఐ కూచిపూడి జగదీష్ సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సంఘటనపై విచారణ జరుపుతున్న ట్లు తెలిపారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే పూర్తి నిజాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. ఈ ఘటన అనంతరం శివాజీ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.