18 August, 2026 | 2:38 AM

3 తులాల బంగారు గొలుసు చోరీ

18-08-2026 12:39 AM

జడ్చర్ల,ఆగస్టు 17:  పట్టణ కేంద్రంలో ప ట్టపగలే చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రే పింది. టీ తాగేందుకు వెళ్లిన దుండగులు ఓ మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును  అపహరించి బ్పై పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసు లు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. జడ్చర్ల పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో టీ కొట్టు నడుపుతున్న ఉదయకళ అనే మహిళ టీ షా పు వద్దకు ఇద్దరు యువకులు బైక్ పై వచ్చి టీ తాగుతామని అంతలోనే ఆ మహిళ మె డలో నుండి మూడు తులాల బంగారు గొ లుసును అపహరించి బైక్‌పై పరారయ్యారు. దీంతో మహిళ లబోదిబోమంటూ బైకు వెం బడి పరిగెత్తిన ఫలితం లేకపోయింది.

మహి ళ ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.అయితే టీ తాగేందుకు వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు టీ తాగుతామని చెప్పి అంతలోనే తన మెడలో నుండి మూడు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారని బాధిత మహిళ ఆవేదనతో కన్నీటి పర్యంతమైంది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని జడ్చర్ల పట్టణ ఎస్సై ఖాదర్ తెలిపారు.