18 August, 2026 | 3:30 AM

సొంత ఖర్చులతో స్కూల్ సుందరీకరణ

18-08-2026 12:37 AM

రాజాపూర్, ఆగస్టు 17 : ఉపాధ్యాయులంటే కేవలం విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి మాత్రమే వెళుతుంటారు. కానీ రాజాపూర్ మండలం సింగమ్మగూడ పంచాయతీ పరిధిలోని రాయి కుంట తండా  ఎం పీపీస్ పాఠశాలలో పనిచేసే టీచర్ వీణమ్మ తను పనిచేస్తున్న సుందరంగా తీర్చిదిద్దాలని సంకల్పించుకున్నారు. పాఠశాల భవనం సుందరీకరణ కోసం తన సొంత డబ్బులు రూ.15వేల రూపాయల ఖర్చుతో పాఠశాలను సుందరంగా పెయింటింగ్,సుందరంగా ఆర్ట్ వేయించారు.

తమ విద్యార్థులు చదువు పట్ల బోధనకు ఉపయోగించే పరికరాలను తయారు చేసి పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. విద్యార్థులను ఇంగ్లీషులో  అద్భుతంగా చదివే విధంగా ప్రోత్సహిస్తున్నారు. టీచర్ వీణమ్మ కు పాఠశాలపై ఉన్న మక్కువ పై మండల విద్యాధికారి సుధాకర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.