calender_icon.png 12 February, 2026 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి దేశవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలి

12-02-2026 12:48:44 AM

తెలంగాణ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు బైరగోని రాజు గౌడ్

ముషీరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల జీవన ఉపాధిని దెబ్బతీస్తుందని తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ ఆరోపించింది.  ప్రధానంగా ఓలా ఊబర్ లాంటి కార్పొరేట్ కంపెనీలు విచ్చరవిడిగా దోపిడీకి పాల్పడుతున్న వారిపై చెర్యలు తీసుకోవడం లేదని విమర్శించింది. 

హైదరాబాద్  హిమాయత్ నగర్  ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం నుండి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో బైరగోని రాజు గౌడ్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనత వల్ల హైదరాబాద్ మహానగరంలో  కార్పొరేట్ కంపెనీలు క్యాబ్ డ్రైవర్ల పొట్టకొడుతున్నాయన్నారు.12న జరిగే భారత్ బంద్ లో పాల్గొని తమ నిరసన తెలుపాలని నిర్ణయించి, బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ఈ ప్రదర్శనలో ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.