12-02-2026 02:40:28 AM
ఆదిలాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఓ మహిళ వద్ద కత్తి లభ్యం అయిన ఘటన కలకలం రేపింది. బుధవారం మున్సిపల్‌లోని 11వ వార్డు పరిధిలో గల రాంనగర్ పోలింగ్ బూత్‌కు ఓటు వేయడానికి భర్తతో కలిసి వచ్చిన పర్వీన్ అనే మహిళను మహిళా పోలీసులు తనిఖీ చేశారు. ఆమె వద్ద కత్తి (బటన్ చాక్)ని గుర్తించిన పోలీసులు విస్తుపోయారు. ఓటు వేయడానికి క్యూ లో ఉన్న మహిళా ఓటర్లు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు పర్వీన్‌ను అదుపులోకి తీసుకుని, ఆమె వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వావాదానికి దిగింది. అనంతరం పర్వీన్‌తో పాటు ఆమె భర్తను మావల పోలీస్ స్టేషన్‌కు తరలించా రు. కత్తితో ఎందుకు వచ్చిందని విచారణ చేపడుతున్నారు.