28 May, 2026 | 2:33 AM

మంత్రి వ్యాఖ్యలను ఖండించిన టీఎన్‌ఎంయూ

28-05-2026 01:30 AM

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): ఎలక్ట్రానిక్ బస్సుల ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీలో తొలుత ఎన్నికలు జరుపుతామని చెప్పడాన్ని తెలంగాణ నేషనల్ మజ్దూర్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. విలీన ప్రక్రియను ఎన్నికలకు సంబంధం లేకుండా అధికారులు, ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక నాయకులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి త్వరితగతిన పూర్తి చేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు పి.కమల్ రెడ్డి, ఎం.నరేందర్ డిమాండ్ చేశారు.

అదేవిధంగా ముఖ్యమంత్రి హామీ మేరకు జూన్ 2న అపాయింటెడ్ డేగా ప్రకటించాలని కోరారు. మంత్రి ప్రకటన ఆర్టీసీ కార్మికులను అయోమయానికి గురి చేస్తుందని ఆర్టీసీ సూపర్‌వైజర్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ వాసు, ప్రెసిడెంట్ అశోక్ తెలిపారు. ముందుగా ఆర్టీసీలో ఉద్యోగుల విలీనమే కావాలని, తరువాతే గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. జూన్ 2న అపాయింటెడ్ డేను ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశామని తెలిపింది. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై వెంటనే సీఎం జోక్యం చేసుకోవాలని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండి మౌలానా, కోక్షూనకన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్ బి. యాదగిరి తెలిపారు.