7 July, 2026 | 1:53 AM

మండలంలో రైతులకు అందుబాటులో 5388 యూరియా బస్తాలు

07-07-2026 12:53 AM

గాంధారి, జూలై 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో 5388 బస్తాల యూరియా అందుబాటులో కలదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.. మండలంలోని వివిధ కేంద్రాలలో యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని అవసరమైన రైతులు యూరియా యాప్ లో బుక్ చేసుకుని యూరియా బస్తాలు పొందాలని వారు సూచించారు.

ఒక సారి బుక్ చేసుకున్న రైతులకు 48 గంటల వరకు బస్తాలు తీసుకునే అవకాశం ఉంటుందని రైతులు గాబర పడి ఇబ్బంది పడవద్దని వారు తెలిపారు.. ఒకసారి యాప్ లో బుక్ చేసుకుని బస్తాలు పొందిన వారికి 20 రోజుల తర్వాత మళ్ళీ బుకింగ్ అవకాశం ఉంటుందని వారు తెలిపారు. రైతులు ఉదయాన్నే యాప్ లో బుక్ చేసుకుని యూరియా తీసుకోవాలని అన్నారు.