7 July, 2026 | 1:43 AM

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబ సభ్యులు

07-07-2026 12:51 AM

బాన్సువాడ, జూలై 6 (విజయక్రాంతి): కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సోమవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు తీర్చుకోవడానికి ప్రత్యేక దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకుని వర్షాలు బాగా కురిసి, పంటలు పండి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు అయినా తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో పోచారం సతీమణి పుష్ప, కుమారులు డా. రవీందర్ రెడ్డి, రాధిక దంపతులు, మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి,సోని రెడ్డి దంపతులు, మనవరాళ్లు, మనుమలతో కలిసి దర్శించుకున్నారు.