25 July, 2026 | 3:42 PM

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థుల సంబరాలు

25-07-2026 03:02 PM

ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల హర్షాతిరేకాలు వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో(Dharmendra Pradhan resignation) విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. సీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ... ఈ విజయం విద్యార్థులందరిదని ప్రకటించారు. ఈ పోరాటంలో విద్యార్థులు విజయం సాధించారని పేర్కొన్నారు. రాజీనామా డిమాండ్ నెరవేరిందని సీజేపీ తెలిపింది. మిగతా రెండు డిమాండ్లు కూడా నెరవేరేవరకు వేచి ఉందామని వెల్లడించారు.

విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీజేపీ నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన అన్ని కేసులు పూర్తిగా ఎత్తివేయాలని సీజేపీ పేర్కొంది. ప్రజాస్వామ్యం అంటే ఇదే. విద్యావ్యవస్థ ప్రక్షాళన చేసేవరకు ఈ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. సాయంత్రం 6 గంటలకు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని సీజేపీ నేతలు పిలుపునిచ్చారు. మాకు రాజకీయాలు అవసరం లేదు. మాకు దక్కిన గొప్ప విజయమిది, ఆత్మహత్య చేసుకున్న చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని సీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.