ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్ర దినోత్సవం
భాజపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి
నేరేడుచర్ల,(విజయక్రాంతి): భారత స్వతంత్ర పోరాటంలో వీర మరణం పొందిన ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేడు మనం స్వేచ్ఛ వాయువులతో అనుభవిస్తున్న స్వాతంత్రం అని భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది ఇచ్చిన పిలుపుమేరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేరేడుచర్ల పట్టణ కేంద్రంలో శుక్రవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చల్లా శ్రీలత రెడ్డి హాజరైన అనంతరం ఆమె మాట్లాడుతూ... వ్యాపారo పేరున నాడు భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు నాటి భారతీయులను అణిచివేసి సుమారు రెండు వందల సంవత్సరాలు నిరంకుశ పాలన చేసిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమి కొట్టి దేశానికి స్వాతంత్రం తెచ్చేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు వీర సావర్కర్,రాజ్ గురు ఇలా ఎందరో మహానుభావులు త్రుణపాయంగా ప్రాణాలు అర్పించారు.
నాటి భారత వీర పుత్రుల ను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత దేశభక్తితో దేశం కోసమే పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా చేసిన తిరంగా ర్యాలీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పినాకిల్ స్కూల్, శ్రీ వాణి స్కూల్, అంజలి స్కూల్, ప్రగతి స్కూల్, అభ్యాస్ స్కూల్, శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులు వెంటరాగా భారత్ మాతాకీ జై అంటూ అలా నాటి మహానుభావులను తలుచుకుంటూ త్రివర్ణ పతాకాలు చేతపట్టి ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కొనతం నాగిరెడ్డి చింతకుంట్ల రాజేష్ రెడ్డి హై స్కూల్ హెడ్మాస్టర్ బట్టు మధు పినాకిల్ స్కూల్ హెడ్మాస్టర్ మదార్ తాళ్ల నరేందర్ రెడ్డి, సంకల మద్ధి సత్యనారాయణ రెడ్డి, మెట్టు శ్రీనివాస్ రెడ్డి, కడారి ఎల్లయ్య, నీల శ్రీనివాస్, తాటికొండ శ్రీనివాస్ రెడ్డి, నరి నాయక్, కొప్పు లక్ష్మీనారాయణ గౌడ్, నాగయ్య బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దేవి రెడ్డి నాగిరెడ్డి వురిమల్ల రామ్మూర్తి, రాచకొండ శ్రీనివాస్, నారద మోహన్ రెడ్డి, శంకర్ రెడ్డి, శావయ్య జ్యూస్ అనిల్, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.






